తెలుగుమాట TelugumAta

Click here to download TelugumAta for Android

Developed by:CALTS,
School of Humanities,
University of Hyderabad.
For : AP Sociiety For Knowledge Networks,
Dept of Communication and Information Technology,
Govt. of Andhra Pradesh.
Project Duration : 6 months
Principal Investigator : Prof. G. Umamaheshwar Rao

TelugumAta is a keyboard which can be installed and used in all applications on your android device. telugumAta allows one to type in Telugu on the phone or any android device where in telugu letters are realized by single key-strokes (instead of multitaps) very fast and very conveniently. All characters are accommodated in two layers unlike other apps.
తెలుగుమాట అనే ఈ కీలపలక(కీ బోర్డు) ఓ అనువర్తనం. ఇది చరవాణులలో, టాబ్లెట్లలో ఉపయోగించుకోవడానికి వీలుగా తయారుచేయబడింది. దీనిలో వర్ణమాలలోని అన్ని అక్షరాలూ ఉంటాయి. ఏ కష్టమూ లేకుండా టైపుచేసే విధంగా అక్షరాల అమరిక ఉంటుంది.అందువల్ల టైపుచేయడం సులభమే కాదు వేగవంతం కూడా. ఈ అనువర్తనం ఆంధ్రప్రదేశ్ జ్ఞానాధార అనుసంధాన వ్యవస్థాపక  సంఘంవారి కోసం కాల్ట్స్ (సెంటర్ ఫర్ అప్లైడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్సలేషన్ స్టడీస్), హైదరాబాదు విశ్వవిద్యాలయం తయారు చేసింది. ఇది అందరికీ పూర్తిగా ఉచితం.







Features:

1. Characters are arranged in sequence which makes Character Identification very simple.
ఇందులో అక్షరాలు వరుస క్రమంలో ఉంటాయి.కాబట్టి గుర్తించడం సులభం.

2. Characters are arranged in two layers where the second layer is invoked by pressing Shiftkey.
అక్షరాల అమరిక రెండు వరుసలలో ఉంటుంది. షిఫ్ట్ కీ నొక్కితే చాలు రెండవ శ్రేణి అందుబాటులోకి వస్తుంది.

3. Text entered is always in UNICODE.
రాసిన పాఠం ఎప్పుడూ యూనికోడ్ లో ఉంటుంది.

4. Symbols and Digits are accommodated.
ఈ కీలపలకలో వర్ణాలతో పాటుగా చిహ్నాలు, అంకెలు కూడా ఉన్నాయి.

5. Special, classical and rare characters (ౘ, ౙ ,ఌ, ౡ, ఽ, ౾, ౿) are also included.
ప్రత్యేక వర్ణాలైన ౘ, ౙ ,ఌ, ౡ, ఽ, ౾, ౿ కూడా ఈ కీలపలకలో ఉన్నాయి.

6. Vowel and consonantal diacritics are automatically formed.
గుణింతాలూ ఒత్తులూ వాటంతట అవే తయారవుతాయి.


Installation Procedure:

1. Download telugumAta from playstore and install this application accordingly on your phone. An Icon is created.
తెలుగుమాట ను గూగుల ప్లేస్టోరునుండి దిగుమతి చేసుకొని ఈ అనువర్తనాన్ని మీ పరికరంలో నెలకొల్పగానే ఒక రూపు ప్రత్యక్షమవుతుంది.

2. Click on the icon to Open the application, then goto "guriMci" -> click on amarpu kosaM -> "Language & input/Locale & text" -> select telugumAta and mark check on Green.
రూపుమీద మీటి మీఅనువర్తనాన్ని తెరిచి, "గురించి" కిపోయి అమర్పుకోసం మీద మీటి -> "Language & input/Locale & text" -> కిపోయి తెలుగుమాట ను ఎంచుకొని ఆకుపచ్చను గుర్తుపెట్టండి.

3. Again Go to "Settings"->"Language & input/Locale & text"-> set Default Keyboard/ Input Method as telugumAta.
మళ్లీ "Settings" కిపోయి -> "Language & input/Locale & text"-> Default Keyboard/ Input Method ను "తెలుగుమాట"గా అమర్చుకోండి

4. Now the Keyboard is ready for use.
ఇప్పుడు కీలపలక వినియోగానికి సిద్ధం.

5. Open any text editor, keyboard appears on the screen.
ఇప్పుడు ఏ పాఠ పరిష్కరిణిని తెరిచినా తెరపై కీలపలక ప్రత్యక్షమవుతుంది.

6. Experience Fast & Easy way of typing Telugu on android devices.
ఏండ్రాయిడు పరికరాలపై వేగంగానూ సులభంగానూ తెలుగు టైపుచేసే అనుభూతిని పొందండి.

7. telugumAta is a versatile input method which makes your typing very Fast & easy
on phones & tablets.
తెలుగుమాటలో ఒక విలక్షణమైన అక్షరాల అమరిక ఉంది. అందువల్ల మీరు చరవాణులపైనా టాబ్లెట్లపైనా వేగంగానూ సులభంగానూ టైపుచేయవచ్చు.

Examples: సంస్కృతి <= స + ం + స +్ + క +ృ + త +ి
You can input English in between Telugu by switching to <ENG> mode and also Symbols by pressing the <123> button.
తెలుగు రాస్తూ మధ్యలో <ENG> నొక్కి ఇంగ్లీషులో రాయవచ్చు. చిహ్నాలకు <123> మీట నొక్కండి.

There is no need to change the IME for typing in English/Telugu. Stay with telugumAta & enjoy the typing.
తెలుగూ ఇంగ్లీషులలో రాయడానికి IME కి మారవలసిన పనిలేదు. తెలుగుమాటను వాడండి! ఆనందించండి!

NOTE: This is only an input method tool for typing.
గమనిక: ఇది టైపుచేయడానికి ఒక అక్షర కూర్పు విధానం మాత్రమే.

"YOUR DEVICE MUST SUPPORT TELUGU REGIONAL LANGUAGE, OTHERWISE SHOWS SQUARE/BLANK BOXES."
“తెలుగు లిపిని వాడుకొనే అవకాశం ఉన్న పరికరాలలోనే ఇది సాధ్యం. లేకుంటే ఖాళీ పెట్టెలు కనబడతాయి.“